: కేటీఆర్ కు స్వాగతం పలికిన సీఎం అఖిలేష్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్ కు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘనస్వాగతం లభించింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుష్పగుచ్ఛం యిచ్చి ఆయనకు సాదర స్వాగతం పలికారు. వాటర్ గ్రిడ్ పథకంపై వివరాలను అఖిలేష్ కు కేటీఆర్ వివరించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు రేమాండ్ పీటర్, సురేందర్ రెడ్డి వెళ్లారు. కాగా, తెలంగాణాలో ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకంపై ఆసక్తి కనబరిచిన అఖిలేష్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటూ కేటీఆర్ ను కోరారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ లక్నో వెళ్లారు.