: పోలీసు స్టేషన్ గడప తొక్కనున్న డిగ్గీరాజా!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. ఇప్పటికే ఓ అంశంపై బీజేపీ నేత నితిన్ గడ్కరీతో వాగ్వాదానికి దిగిన డిగ్గీరాజా కోర్టు మెట్లెక్కారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు దాదాపు పదేళ్లకు పైగా ఆయన మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధాన సభ రిక్రూట్ మెంట్ లో చోటుచేసుకున్న కుంభకోణం డిగ్గీరాజా హయాంలోనే జరిగిందట. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాంగ్మూలమివ్వాలన్న పోలీసుల నోటీసులతో ఆయన నేడు జహంగిరాబాదు పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. 1993-2003 మధ్య చోటుచేసుకున్న ఈ కుంభకోణంలో నాటి సీఎం హోదాలో డిగ్గీరాజాతో పాటు నాటి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ తివారీ తదితరులపై ఈ ఏడాది ప్రథమార్ధంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News