: మహారాష్ట్రలో మళ్లీ తెరుచుకోనున్న డ్యాన్స్ బార్లు


మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, మూత పడిన డ్యాన్స్ బార్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయంపై వాటి యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2005లో తొలిసారి డ్యాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2013లో ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం పోలీసు చట్టాన్ని సవరించి, డ్యాన్స్ బార్లను మళ్లీ నిషేధించింది. ఈ నేపథ్యంలో, ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం కొందరు రాజకీయనాయకులు తమ వ్యక్తిగత ప్రతీకారాలను తీర్చుకోవడానికే, డ్యాన్స్ బార్లపై నిషేధం విధించారని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీంతో, మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లు తమ కస్టమర్లను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అయితే, డ్యాన్స్ సందర్భంగా డ్యాన్సర్లు ఆశ్లీలంగా ఉండరాదని సుప్రీంకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News