: పాక్ నుంచి 'గీత' వస్తోంది... తల్లిదండ్రులను గుర్తించిన అధికారులు

ఆ యువతి 12 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. తన చిన్నతనంలో తప్పిపోయి, పొరపాటున సరిహద్దులు దాటి, పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న గీత తల్లిదండ్రులు బీహార్ లో ఉన్నారని, అధికారులు డీఎన్ఏ పరీక్షల తరువాత గుర్తించారు. ఇక ఫార్మాలిటీస్ పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరలో ఆమెను ఇండియాకు రప్పిస్తామని ఢిల్లీ అధికారులు వివరించారు. ప్రస్తుతం కరాచీలోని ఈదీ ఫౌండేషన్ అనే సంస్థ ఆశ్రయంలో గీత కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. 11 ఏళ్ల వయసులో 2003లో తప్పిపోయిన ఆమెకు ఇప్పుడు 24 ఏళ్లు. గీత తమ కూతురంటే, తమ కూతురని తెలంగాణ, యూపీ, జార్ఖండ్ వంటి ఎన్నో ప్రాంతాల నుంచి పలువురు విదేశాంగ శాఖను సంప్రదించగా, అందరి చిత్రాలనూ సేకరించిన అధికారులు వాటిని గీతకు చూపించారు. బీహార్ నుంచి వచ్చిన ఓ భార్యాభర్తల చిత్రాన్ని గీత గుర్తించింది. వారు తన తల్లిదండ్రులుగా చెప్పడం, రక్త పరీక్షలు సరిపోవడంతో గీత భారత్ రాకకు మార్గం సుగమమైంది.

More Telugu News