: ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టించింది... ఈ సారి రైతుల వంతు!


నిన్నటిదాకా ఉల్లి వినియోగదారులను కన్నీళ్లు పెట్టించింది. దాదాపు కిలో ధర రూ.100 చేరువైన ఉల్లి, ఏకంగా మార్కెట్ యార్డుల్లో సబ్సీడీ విక్రయ కేంద్రాలు తెరిచేలా చేసింది. తాజాగా ఉల్లి తన ఘాటు రూటును మార్చింది. రైతన్న కంట కన్నీరు పెట్టించింది. అసలు విషయమేంటంటే... నిన్నటిదాకా ఆకాశాన్నంటిన ఉల్లి ధర, ప్రస్తుతం పాతాళానికి చేరింది. ఉల్లి సాగుకు ప్రసిద్ధి గాంచిన కర్నూలు జిల్లా రైతులు తమ బతుకులు బాగు పడతాయని ఆశగా కర్నూలులోని మార్కెట్ యార్డుకు వచ్చారు. అయితే క్వింటాలు ఉల్లికి రూ.300 ధర మాత్రమే ఇస్తామని వ్యాపారులు తెగేసి చెప్పారట. దీంతో కంగు తిన్న రైతులు ఇదేంటని వ్యాపారులను నిలదీశారు. వ్యాపారుల నుంచే కాక మార్కెట్ యార్డు అధికారుల నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News