: బోనమెత్తిన కల్వకుంట్ల కవిత... ఏడుపాయల వనదుర్గా మాతకు మొక్కులు


తెలంగాణలో ప్రస్తుతం బతుకమ్మ వేడుకలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలి హోదాలో నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. నేటి కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం మెదక్ జిల్లాకు వచ్చిన కవిత బోనమెత్తారు. మెదక్ సమీపంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రంలోని వనదుర్గా మాతకు ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. కవితతో పాటు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా వనదుర్గా మాతకు మొక్కులు చెల్లించుకున్నారు.

  • Loading...

More Telugu News