: ఒడిశాలో మావోల ఘాతుకం... ఇన్ఫార్మర్ల నెపంలో ఇద్దరు గిరిజనుల హత్య


ఏపీలోని విశాఖ జిల్లా జీకే వీధి మండలానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను 9 రోజుల పాటు బందీలుగా ఉంచుకున్న మావోయిస్టులు ఎట్టకేలకు నిన్న రాత్రి విడుదల చేశారు. గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన సంప్రదింపులతో మావోలు శాంతించారు. 9 రోజుల ఉత్కంఠకు తెరపడిందన్న సంతోషం గిరిజన వర్గాల్లో కొన్ని గంటల సేపు కూడా నిలవలేదు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా కన్నాగోడాకు చెందిన ఇద్దరు గిరిజనులను అపహరించిన మావోలు వారిని దారుణంగా హతమార్చారు. ఇన్ఫార్మర్ల నెపంతో సోమామాడి, రమామాడి అనే ఇద్దరు గిరిజనులను అపహరించిన మావోలు వారిని కాల్చి చంపారు.

  • Loading...

More Telugu News