: 'దాద్రి'కి ప్రతీకారం తీర్చుకుంటారు: ఏ క్షణమైనా ఉగ్రదాడి జరగవచ్చన్న నిఘా వర్షాలు
ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో పశుమాంసం తిన్నాడన్న విషయమై రాజకీయ నేతల మధ్య ఆరోపణల పర్వం ఇంకా సాగుతూనే ఉన్న వేళ, ఈ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఏ క్షణమైనా దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి. యూపీ ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు కేంద్ర నిఘా వర్గాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో బాంబు పేలుళ్లను జరిపేందుకు స్లీపర్ సెల్స్ కుట్రలు పన్నుతున్నట్టు సమాచారం అందిందని తెలుస్తోంది. కాగా, వీహెచ్పీ నేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ పండగ సీజనులో దాడులకు అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.