: మరో పెళ్లి చేసుకుంటున్న రాహుల్ మాజీ భార్య


కేంద్ర మాజీ మంత్రి, దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ మాజీ భార్య డింపీ గంగూలీ (30) రెండో వివాహానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. దుబాయ్ వ్యాపారవేత్త రోహిత్ రాయ్ తో ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపింది. అంతేకాకుండా, ఎంగేజ్ మెంట్ ఉంగరం ఫొటోను కూడా అప్ లోడ్ చేసింది. నవంబర్ 27వ తేదీన కోల్ కతాలో వీరి వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలకు చెందిన వారు, కొంత మంది సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు. రాహుల్ మహాజన్ ను 2010లో డింపీ గంగూలీ పెళ్లాడింది. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు కలిసి 2009 నుంచి పలు రియాల్టీ షోలలో పాల్గొన్నారు. రెండేళ్లుగా రోహిత్ రాయ్ తో డింపీ ప్రేమాయణం సాగిస్తోంది. మరో విషయం ఏమిటంటే, తన మాజీ భార్య డింపీకి రాహుల్ మహాజన్ శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

  • Loading...

More Telugu News