: రామేశ్వరంలో కలాం స్మారకం... ప్రధాని మోదీ ప్రకటన


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నేటి ఉదయం ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమిళనాడులోని రామేశ్వరంలో కలాం స్మారకాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే రామేశ్వరంలో స్థలం కూడా సేకరించామని మోదీ చెప్పారు. ఇటీవల కలాం మరణించిన సంగతి తెలిసిందే. కలాం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మోదీ తన కేబినెట్ లోని ముఖ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లారు. కలాం చివరి కోరిక మేరకు రామేశ్వరంలో అంత్యక్రియలు జరిపిన కేంద్రం, అక్కడే కలాం స్మారకం ఏర్పాటుకు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News