: ప్రపంచంలో ఉద్యోగులకు బెస్ట్ కంపెనీ ఇదే
ఉద్యోగాలు చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా వరుసగా మూడవ సంవత్సరమూ 'గూగుల్' తొలి స్థానంలో నిలిచింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ ఎస్ఏఎస్ ఇనిస్టిట్యూట్, మాన్యుఫాక్చరింగ్ సంస్థ డబ్ల్యూఎల్ గోరే ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ 'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్' ఈ జాబితాను తయారు చేసి టాప్-25 కంపెనీల పేర్లను ప్రకటించగా, ఒక్క భారత కంపెనీకి కూడా స్థానం దక్కలేదు. ఈ జాబితాలో డేటా స్టోరేజ్ స్పెషలిస్టు సంస్థ నెట్ యాప్ (4), కమ్యూనికేషన్స్ సేవల సంస్థ టెలీఫోనికా (5), ఈఎంసీ కార్పొరేషన్ (6), మైక్రోసాఫ్ట్ (7), బీబీవీఏ (8), మాన్ శాంటో (9), అమెరికన్ ఎక్స్ ప్రెస్ (10)వ స్థానాల్లో నిలిచాయి. ఆపై మారియట్, బెల్ కార్ప్, స్కాషియా బ్యాంక్, ఆటో డెస్క్, సిస్కో, అటెంటో, డియాజియో, అకార్, హయత్, మార్స్, కాడినెన్స్, హిల్టీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్, హెచ్ అండ్ ఎం, నోవో నార్డిస్క్ కంపెనీలు నిలిచాయి. మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులను ప్రశ్నించి ఈ జాబితాను తయారు చేశామని, 47 దేశాలకు చెందిన కంపెనీలు పోటీ పడ్డాయని సర్వే నిర్వాహకులు వెల్లడించారు.