: 18న కేసీఆర్ ఇంటికి చంద్రబాబు... ‘అమరావతి’ ఆహ్వానం అందించేందుకేనట!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికి వెళ్లనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆయన కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అమరావతి ఆహ్వాన పత్రికను చంద్రబాబు, కేసీఆర్ కు అందిస్తారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని తెలంగాణ సీఎం కు తానే స్వయంగా అందజేస్తానని మొన్నటి కేబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లకు ఆహ్వానాలను అందజేసిన అనంతరం కేసీఆర్ కు ఆహ్వానం పలికే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న తానే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కు ఆహ్వానం పలికిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తదితరులకు కూడా చంద్రబాబు ఆహ్వాన పత్రికలను అందించనున్నారు.

  • Loading...

More Telugu News