: అఖిలేశ్ యాదవ్ ఆహ్వానం...అధికారుల బృందంతో లక్నో బయలుదేరిన కేటీఆర్
తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నుంచి ఆహ్వానం అందిందట. వెనువెంటనే సానుకూలంగా స్పందించిన కేటీఆర్ అధికారుల బృందంతో కలిసి కొద్దిసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో బయలుదేరారు. అయినా ఏ విషయంలో కేటీఆర్ కు అఖిలేశ్ ఆహ్వానం పంపారో తెలుసా? తెలంగాణలో ప్రతి ఇంటికి తాగు నీటి సరఫరా కోసం ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకంపై అఖిలేశ్ ఆసక్తి కనబరిచారట. సదరు పథకంపై పూర్తి వివరాలు కావాలంటూ ఆయన కేటీఆర్ ను కోరారట. దీంతో అధికారుల బృందంతో కలిసి కేటీఆర్ లక్నో బయలుదేరారు. అక్కడ వాటర్ గ్రిడ్ పథకంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అఖిలేశ్ కు సమగ్ర వివరాలు అందిస్తారట.