: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులా?... డోంట్ వర్రీ, మీకోసం రైలొస్తోంది!


రైల్ టికెట్ కొంటే కన్ఫర్మ్ కాలేదా? అయితే మీకో శుభవార్త. టికెట్ రద్దు చేసుకునే అవసరం లేకుండా, అదే టికెట్ పై మరో రైల్లో ప్రయాణం చేసే సదుపాయాన్ని భారతీయ రైల్వేలు నవంబర్ 1 నుంచి దగ్గర చేయనున్నాయి. ఈ మేరకు కొత్త వ్యవస్థ మార్గదర్శకాలు, అమలుపై అన్ని జోనల్ కార్యాలయాలకూ రైల్వే శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ విధానంలో టికెట్లు కొని కన్ఫర్మ్ కాని వారికి 'బ్యాకప్ ట్రైన్ల'లో ఖాళీగా ఉన్న బెర్త్ లను కేటాయిస్తారు. వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులను అదే మార్గంలో తరువాత వెళ్లే రైళ్లలో సర్దాలని ఆదేశించారు. ఆ లిస్టు కూడా ఎక్కువగా ఉంటే, అప్పటికప్పుడు ప్రత్యేక రైలును వేయాలని, వాటిల్లో ఖాళీలు ఉంటే కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని రైల్వే శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ సదుపాయం కావాలనుకుంటే, టికెట్లను బుక్ చేసుకునే సమయంలో, టికెట్ కన్ఫర్మ్ కాకుంటే మరో రైల్లో వెళ్లేందుకు అభ్యంతరం లేదన్న ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News