: నాన్నలే అంతా చేస్తున్నారట!
"అంతా నువ్వే చేశావు నాన్నా" కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలోని డైలాగు ఇది. ఇండియన్స్ లో తమ పిల్లల కెరీర్ ఎలా ఉండాలన్నది, తన కొడుకు డాక్టర్ కావాలా? ఇంజనీర్ కావాలా? అన్న విషయాలపై ఓ ఆలోచనలో ఉండి చిన్నప్పటి నుంచి వారిలో ఆ కోరికను పెంచాలని ప్రయత్నించే వారు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. అసలు ఏ దేశంలో తండ్రులు తమ బిడ్డల కెరీర్ పై అధికంగా జోక్యం చేసుకుంటున్నారన్న విషయమై లింకెడిన్ ఓ సర్వే చేసింది. ఇండియన్స్ లో 82 శాతం మంది తమ చిన్నారులు ఏ రంగంలోకి వెళ్లాలన్నది నిర్ణయిస్తున్నారని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ తరహా ధోరణి బ్రెజిల్ లో అత్యధికంగా 92 శాతం ఉండగా, ఆ తరువాతి స్థానంలో 87 శాతంతో చైనా నిలిచింది. తమ పిల్లలు రోజూ ఏం చేస్తున్నారన్న విషయమై తమకు అవగాహన ఉందని ప్రపంచవ్యాప్తంగా 77 శాతం మంది వెల్లడించగా, ఇండియాలో 84 శాతం మంది పిల్లల కార్యకలాపాల గురించి తెలుసునని చెప్పారట.