: చైన్ స్నాచర్లు కనిపిస్తే... కాల్చివేతే!: సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్


హైదరాబాదులో చైన్ స్నాచర్లపై పోలీసులు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. చైన్ స్నాచర్లు కనిపిస్తే కాల్చివేస్తామంటూ సైబరాబాదు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్న తేల్చిచెప్పారు. జంట నగరాల్లో బైకులపై దూసుకొస్తున్న చైన్ స్నాచర్లు మహిళలపై యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఇరానీ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబరాబాదు పోలీసులు పట్టేశారు. తప్పించుకున్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీవీ ఆనంద్ చైన్ స్నాచర్లపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న ఇరానీ గ్యాంగ్ సభ్యుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. పట్టుబడ్డ ముగ్గురు స్నాచర్ల నుంచి కిలో బంగారు ఆభరణాలతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News