: ట్విట్టర్ కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒమిద్


‘ఇవాళ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఒమిద్ కొర్డెస్టానీని నియమించాం. ఒమిద్, మాకు సహాయసహకారాలు అందజేస్తారు. ట్విట్టర్ సంస్థ అభివృద్ధికి ఆయన తోడ్పడతారు’ అని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా గూగుల్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఒమిద్ కొర్డెస్టానీని నియమించారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ బుధవారం నాడు ట్వీట్ చేశారు. కాగా, ట్విట్టర్ నష్టాల బాటలో ఉన్న కారణంగా 336 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఘటన జరిగిన మర్నాడే ఒమిద్ నియామకం జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News