: నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించా: సీఎం చంద్రబాబు


ఈ నెల 22న జరగనున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో ప్రధానిని కలసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్, అరుణ్ జైట్లీతో పాటు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, పలువురు ప్రముఖులను ఈ శంకుస్థాపన మహోత్సవానికి రావాలని ఆహ్వానించామన్నారు. అంతేకాకుండా ఇతర ప్రముఖులకు కూడా ఆహ్వానపత్రాలు పంపుతామని చెప్పారు. స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను ప్రధానికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News