: విభజన జరగకపోతే విజయవాడ, అమరావతి అభివృద్ధి చెందేవా?: కేటీఆర్
రాష్ట్ర విభజనతో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఏపీలో విజయవాడతో పాటు పలు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే అమరావతి రాజధాని అయ్యేదా? అని ప్రశ్నించారు. అంతేగాక రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడేవా? అని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చి అనేకమంది హైదరాబాద్ లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. కాగా విశాఖలో తుపాన్ వచ్చినప్పుడు రూ.18 కోట్లతో విద్యుత్ పరికరాలు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే వేసవి నాటికి గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, చాలా మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.