: నేతాజీ మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి: ప్రధానితో బోస్ కుటుంబసభ్యులు
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబసభ్యులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నేతాజీ మృతిపై ఉన్న భిన్న కథనాలపై అనుమానాలను తేటతెల్లం చేయాలని వారు ప్రధాని మోదీని కోరారు. ఇందుకు సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేయాలని నేతాజీ కుటుంబ సభ్యులు విఙ్ఞప్తి చేశారు. బోస్ కు సంబంధించిన వాస్తవాలను ప్రజలందరూ తెలుసుకోవాలని, నేతాజీకి సంబంధించిన ఫైళ్లు ఎక్కడున్నా వాటిని సేకరిస్తామని, అందులో విషయాలను బహిర్గతం చేస్తామని బోస్ కుటుంబసభ్యులకు ప్రధాని హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం.