: తడబడిన టీమిండియా, ఇది కూడా..!


దక్షిణాఫ్రికాతో ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. టాప్ ఆర్డర్ లో ఒక్క రహాన్ 51 పరుగులు చేయడం మినహా, మిగతా కీలక ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే పెవీలియన్ దారిపట్టారు. దీంతో 41 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో ధోనీ, హర్భజన్ ఆడుతున్నారు. స్కోరు కనీసం 250 పరుగులు దాటకుంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడిక భారత జట్టును ధోనీ మాత్రమే ఆదుకోవాల్సి ఉంది. ధోనీ 49 పరుగులతో ఆడుతుండటం ఒక్కటే ఇండియాకు సానుకూలాంశం.

  • Loading...

More Telugu News