: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావుకు అస్వస్థత
ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఫిలింనగర్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 65 ఏళ్ల మాడా తెలుగులో 'ముత్యాలముగ్గు', 'చిల్లరకొట్టు చిట్టెమ్మ', 'ప్రేమాభిషేకం' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 'చిల్లరకొట్టు చిట్టెమ్మ'లో 'ఏంటి బాయ్యా' అంటూ ఆయన పోషించిన హిజ్రా పాత్ర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది.