: కొడుకును పొట్టనబెట్టుకున్న తల్లిదండ్రులు!


న్యూయార్క్ నగర శివార్లలోని న్యూ హార్ట్ ఫీల్డ్ ప్రాంతంలో ని ‘వర్డ్ ఆఫ్ లైప్’ చర్చిలో యువసోదరులపై జరిగిన దాడిలో ఒకరు చనిపోగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. దారుణమైన విషయమేమిటంటే, ఈ దాడికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులలో యువకుల తల్లిదండ్రులు కూడా ఉండటం. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వివరాలు... బ్రూస్, దెబొరా ల కుమారులు లూకస్(19), క్రిస్టోఫర్ (17). గత సోమవారం వారందరూ ‘వర్డ్ ఆఫ్ లైప్’ చర్చికి వెళ్లారు. యువకుల తల్లిదండ్రులతో పాటు చర్చికి చెందిన జోసెఫ్, డేవిడ్, లిండా, సారా అనే నలుగురు కలిసి యువకులను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వాళ్లిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. లూకస్ మృతి చెందగా, క్రిస్టోఫర్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. కాగా, ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఒక్కొక్కరూ లక్ష డాలర్లు పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందవచ్చని కోర్టు చెప్పింది. అయితే, బెయిల్ తీసుకునేందుకు నిందితులు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు. బెయిల్ అవసరం లేనప్పుడు దాని కోసం ఎందుకు పిటిషన్ పెట్టారనే దానికి నిందితులు సమాధానం చెప్పట్లేదు. కాగా, కన్నబిడ్డలపై తల్లిదండ్రులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే విషయం పలు అనుమానాలకు దారి తీస్తోందని పోలీసులు అన్నారు.

  • Loading...

More Telugu News