: రైతు ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలనే కోర్టులో పిటిషన్ వేశా: కోదండరాం

రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం చెప్పారు. ఈ మేరకు వరంగల్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున కోదండరాం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.