: పిలవని పెళ్లికి అతిథిగా వెళ్లిన బరాక్ ఒబామా


ఆ జంట ప్రమాణాల సాక్షిగా ఒకటవుతున్న వేళ అనుకోని అతిథి వచ్చారు. అది ఎవరో కాదు... సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీంతో ఆ కొత్త జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. నూతన వధూవరులు స్టిఫానీ, బ్రియాన్ టోబేలు తమ వివాహాన్ని లా జొల్లా లోని గోల్ఫ్ కోర్స్ లో వేడుక జరపాలని నిర్ణయించుకున్నారు. అదే సమయానికి కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ఒబామా అదే ప్రాంతంలో వ్యాహ్యాళికి వచ్చారు. "తొలుత మీ వివాహ వేడుకను వెంటనే ముగించండి లేదా కాస్త ఆలస్యంగా మొదలు పెట్టుకోండి" అని ఆయన రక్షణ సిబ్బంది కోరినట్టు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఎరిన్ సీఎన్ఎన్ కు తెలిపారు. "సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన రెండు ఎస్యూవీలను చూసిన తరువాత, అందులో ఉన్నది ఎవరో మాకు తెలిసింది" అని టోబ్ వ్యాఖ్యానించారు. వీరిని చూసి ఆహ్వానించిన ఒబామా వారితో కలసి ఎన్నో ఫోటోలు దిగారు. ఇది తమకు జీవితాంతమూ గుర్తుండిపోతుందని ఆ జంట ఇప్పుడు ఆనందంగా చెప్పుకుంటోంది. గత సంవత్సరం ఓ గోల్ఫ్ కోర్సులో ఒబామా కోసం భద్రతా సిబ్బంది బలవంతంగా ఓ పెళ్లిని రద్దు చేయడం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి ఆనందానికి అడ్డు వచ్చినందుకు ఒబామా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News