: ఏడు హత్యల రియల్ స్టోరీకి ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్
2015 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక మాన్ బుకర్ ప్రైజును జమైకా రచయిత మార్లోన్ జేమ్స్ గెలుచుకున్నాడు. 1976లో జరిగిన బాబ్ మార్లీ హత్యా సంఘటన ఆధారంగా ఆయన రాసిన 'ఫిక్షనల్ హిస్టరీ' పుస్తకానికి ఈ గుర్తింపు లభించింది. ఓ జమైకన్ ఈ అవార్డు గెలుపొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొత్తం 686 పేజీలున్న ఈ పుస్తకంలో మొత్తం 7 హత్యల గురించిన ప్రస్తావన ఉంది. "ఇదో క్రైం నవల. అద్భుతమైన వేగంతో సాగుతుంది. ఇటీవలి కాలంలో ఇంత క్లాసిక్ బుక్ ను మేం చూడలేదు" అని న్యాయ నిర్ణేతలు విజేతను వెల్లడిస్తున్న సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, జేమ్స్ రచించిన తొలి నవల 'జాన్ క్రోస్ డెవిల్' లాస్ ఏంజిలస్ టైమ్స్ బుక్ ప్రైజుకు, కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ కు పోటీపడ్డప్పటికీ, బహుమతులు పొందలేదు. రెండవ నవల 'ది బుక్ ఆఫ్ నైట్ ఉమన్' డేటన్ లిటరరీ పీస్ బహుమతిని పొందింది.