: బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ కు చికిత్స


యోగా గురువు రాందేవ్ బాబా ఆశ్రమంలో బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ చికిత్స చేయించుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని ముంబై నుంచి హరిద్వార్ లో ఉన్న రాందేవ్ బాబా పతంజలి యోగపీఠానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయుర్వేద గురువు ఆచార్య బాలకిషన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ‘హో గయా దిమాగ్ కా దహీ’ చిత్ర దర్శకుడు ఫౌజియా అర్షి తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొంది, మళ్లీ షూటింగ్ కు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఖాదర్ ఖాన్ ఆరోగ్యం విషయంలో నిర్మాత సంతోష్ భారతీయ చాలా శ్రద్ధ కనపరుస్తున్నారని ఆయన చెప్పారు. ‘హో గయా దిమాగ్ కా దహీ’ చిత్రంలో ఖాదర్ ఖాన్ నటిస్తుండటంతో ఆయన ఆరోగ్య బాధ్యతలను చిత్ర యూనిట్ చూసుకుంటోంది. కాగా, జాన్ అబ్రహం, పరేష్ రావెల్, సునీల్ శెట్టి లతో కలిసి ‘హేరా ఫేరీ 3’ చిత్రంలో కూడా ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News