: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ‘పాక్’లో రహస్యంగా పర్యటించారు: పాక్ మాజీ మంత్రి కసూరీ
భారత ప్రభుత్వం తరపున ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తమ దేశంలో రెండుసార్లు రహస్యంగా పర్యటించారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ వెల్లడించారు. అందుకోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసిందని, ఆ విమానంలోనే ఇస్లామాబాద్ కు వెళ్లారంటూ ఆయన తెలిపారు. జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి, ఈమధ్య కాలంలో మరోసారి దిలీప్ పాక్ లో పర్యటించారన్నారు. దిలీప్ కుమార్ రహస్యంగా పర్యటించిన విషయాన్ని స్వయంగా ఆయన భార్య సైరాబానుయే తనకు చెప్పిందంటూ కసూరీ వ్యాఖ్యానించారు. జిన్నా భారత దేశంలో ఉన్న చివరి రోజున ముంబైలో దిలీప్ కుమార్ ని కలిశారని అన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ కాలం నాటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ కు రావాల్పిన బకాయిల విషయమై నాడు మహాత్ముడు నిరవధిక దీక్ష చేశారని, ఈ సంగతి పాక్ లో కూడా చాలామందికి తెలియదని అన్నారు.