: మల్లారెడ్డి మెడికల్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురు
మెడికల్ సీట్ల విషయంలో మల్లారెడ్డి కళాశాలకు ఉమ్మడి హైకోర్టులో నిరాశ ఎదురైంది. వైద్య కళాశాలలో ఏ, బీ కేటగిరీల్లోని 127 సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఆదేశించింది. ఏ, బీ కేటగిరీల్లోని మెడికల్ సీట్లు అమ్ముకున్నారన్న అభియోగంతో కోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఒక్కో సీటు కోటి రూపాయల వరకు పెద్ద ఎత్తున సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.