: దాద్రి ఘటనపై అంతా స్పందించాక మోదీ ప్రకటన చేస్తారా?: ఆజంఖాన్
ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని ఆ రాష్ట్ర మంత్రి ఆజంఖాన్ తప్పుబట్టారు. ఈ ఘటనపై ప్రపంచమంతా ఖండించిన తరువాత మోదీ ప్రకటన చేయడం శోచనీయమన్నారు. దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని, అలాంటి ఘటనపై అందరూ మాట్లాడాక ప్రధాని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లాలూను విమర్శిస్తూ 'సైతాన్' పదాన్ని ప్రస్తావించిన మోదీపై ఆజం మండిపడ్డారు. ఈ పదాన్ని ఆయన చాలా తేలిగ్గా వాడారన్నారు. కానీ తన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధంగా ఉన్న ఇతర పార్టీలు మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని విమర్శించారు.