: వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తా: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోని లక్షలాది మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ మహా మోసం వైసీపీ నేతల తలకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు. ఈ వ్యవహారంపై ఇటీవల మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు... టీడీపీ సీనియర్ నేత, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన భార్య పేరిట మంత్రి ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేశారని, ఈ కారణంగా మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి ప్రత్తిపాటి కొద్దిసేపటి క్రితం ఘాటుగా స్పందించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన ఆయన, అగ్రిగోల్డ్ ఆస్తులను తాను కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పారు. తనపై అసత్య ఆరోపణలు గుప్పించిన వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News