: టెస్టు మ్యాచ్ మధ్యలో మూడు వయాగ్రాలు తీసుకుంటే...: ఫ్లింటాఫ్ స్వీయ అనుభవం
ఓ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకటీ, రెండు కాదు... ఏకంగా మూడు వయాగ్రా మాత్రలు వేసుకుంటే, ఆపై తనకు ఏం జరిగిందో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ స్వీయ అనుభవాన్ని తొలిసారిగా పంచుకున్నాడు. తాను రాసిన కొత్త పుస్తకంలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ ఆడాల్సిన తాను, ముందు రోజు రాత్రి మూడు వయాగ్రా మాత్రలు వేసుకున్నానని, మరుసటి రోజు వికెట్ల మధ్య పరిగెత్తలేక రన్నౌట్ అయ్యాయని తెలిపాడు. ఒక్కో మాత్ర ఎంత సేపు ప్రభావం చూపుతుందన్న విషయమై తనకు అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించినట్టు 'డైలీ మెయిల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎందుకోసం వయాగ్రాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించక పోవడం గమనార్హం. ఈ ఘటన ఏమ్యాచ్ లో జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన తెలియజేయలేదు.