: హేమ అలియాస్ శైలు, రాణి, అలేఖ్యా రెడ్డి... అడ్డంగా దొరికిపోయిన నిత్య పెళ్లి కూతురు


కాస్త డబ్బులున్న వ్యక్తి కనిపిస్తే చాలు... పేరు మార్చుకుని అతని ముందు వాలిపోయి, పెళ్లి పీటలు ఎక్కించి ఆపై మోసం చేయడం ఆమె నైజం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురిని పెళ్లాడింది. తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నని చెప్పి, ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసింది. చివరికి ఆస్తి కోసం బంధువులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు, రాణి, బుజ్జి, లేఖ్యారెడ్డి, హేమలత... ఇలా ఎన్నో పేర్లు మార్చింది. ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆమె, మొదట ఎల్బీ నగర్‌ కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త వేధిసున్నాడంటూ ఎల్బీ నగర్ స్టేషన్‌ లో కేసు పెట్టింది. ఆపై బోరబండకు వచ్చి జగదీష్ అనే వ్యక్తిని, తరువాత పూర్ణచందర్ ను, నాలుగో పెళ్లిలో కరీంనగర్‌ కు చెందిన కిశోర్‌ ను వివాహం చేసుకుంది. వీరందరిపైనా వేధింపుల కేసులు పెట్టి వదిలించుకుంది. ఆపై తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆమెపై వివిధ పోలీసు స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయని, ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News