: పాక్ ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన ఆ దేశ రక్షణ మంత్రి!


పాకిస్థాన్ రక్షణ మంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్, ఓ భారత పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ దేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో ఉన్నాడన్న సంగతి తమకు తెలుసునని, ఆయనకు ఆశ్రయం ఇచ్చింది తామేనని అహ్మద్ ముక్తార్ బాంబు పేల్చాడు. దీంతో, ఇప్పటివరకూ అబోటాబాద్ లో లాడెన్ ఉన్నట్టు తమకు తెలియదని, తమ ప్రమేయం లేకుండానే అమెరికా దాడులు జరిపి ఆయన్ను హతమార్చిందని ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చిన పాకిస్థాన్, ఇప్పుడు తాజాగా మరో బుకాయింపునకు తెరలేపింది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ ముషార్రఫ్, రషీద్ ఖురేషీలు అహ్మద్ ముక్తార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అహ్మద్ అబద్ధాల కోరని, ఆయన చెబుతున్నవి నిజం కాదని వారు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News