: తిరుపతి రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపులు...ముమ్మర సోదాల్లో పోలీసులు


తిరుపతి రైల్వే స్టేషన్ లో నేటి తెల్లవారుజామున పెను కలకలం రేగింది. రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టామన్న గుర్తు తెలియని దుండగుల ఫోన్ కాల్స్ తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ లో బాంబుందన్న సమాచారంతో ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ గుర్తు తెలియని దుండగుడు నేరుగా ఆర్పీఎఫ్ సిబ్బందికే ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు చెందిన బ్యాగేజీనంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాంబ్ స్క్వాడ్ ను కూడా రప్పించారు. ప్రస్తుతం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News