: బీఎస్పీని గెలిపిస్తే ఉన్నత వర్గాల్లో పేదలకు రిజర్వేషన్లు: మాయావతి
బీహార్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ వాది పార్టీని గెలిపిస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. రోహతన్ జిల్లా కరాహ్గర్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి షమిమ్ అహ్మద్ తరపున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఇతర వెనుకబడిన కులాలమాదిరిగానే ఉన్నత వర్గాల్లో పేదల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. లౌకిక కూటమి, ఎన్డీయే కూటములను నమ్మవద్దని ప్రజలను కోరారు. తప్పుడు హామీలివ్వడం, యిచ్చిన హామీలను అమలు చేయకపోవడం వంటివి ఈ రెండు కూటమిలకు వెన్నతో పెట్టిన విద్య అని మాయావతి విమర్శించారు.