: బాహుబలి-2 కోసం స్థలపరిశీలన చేశాము: దర్శకుడు రాజమౌళి
‘బాహుబలి-2 కొత్త సెట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ వెళ్లాము. ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్, మకుట వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ పీట్ డ్రేపర్ లతో కలిసి స్థల పరిశీలన చేశాము’ అని చిత్ర దర్శకుడు రాజమౌళి తన ఫేస్ బుక్ అకౌంట్ లో తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోని ఆయన పోస్ట్ చేశారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా లు ప్రధాన తారాగణంగా ఇటీవల విడుదలైన బాహుబలి చిత్రం రికార్డుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా బాహుబలి-2 చిత్రాన్ని జక్కన్న రూపొందిస్తున్నారు.