: కొత్త రోబోఫోన్.. డ్యాన్స్ కూడా చేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబో ఫోన్ ను పరిచయం చేస్తున్న సంస్థ షార్ఫ్. జపాన్ కు చెందిన ఈ సంస్థ రోబో హోన్ పేరిట ఈ స్మార్ట్ ఫోన్ ను వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. అవేంటో తెలుసుకుందాము.. జేబులో చక్కగా ఇమిడి పోతుంది, కాల్స్ మాట్లాడేందుకు, ఫొటోలుతీసేందుకు, మ్యాప్ లు చూపిస్తుంది. చిన్నపాటి టచ్ స్క్రీన్ ఉండే ఈ ఫోన్ లో ఒక్కో స్క్రీన్ మీద కేవలం నాలుగు ఐకాన్ లు మాత్రమే కనిపిస్తాయి. ఫోన్ వెనుక భాగంలో రెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. రోబో ఫోన్ ముఖం భాగం లోపల కెమెరా, ప్రొజెక్టర్ అమర్చారు. ఈ ఫోన్ కు రోబోట్ చేతులు, కాళ్లు అమర్చారు. దీంతో అది నడిచేందుకు వీలుగా ఉంటుంది. ఈ ఫోన్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే డ్యాన్స్ చేయమని కోరితే డ్యాన్స్ చేస్తుంది. యూజర్ వాయిస్ ను, ముఖాన్ని గుర్తించే సామర్థ్యం కూడా రోబో ఫోన్ కు ఉంది. ఈ ఫోన్ ను అభివృద్ధి పరచింది ప్రసిద్ధ టోక్యో ప్రొఫెసర్, రోబోటిసిస్ట్ టొమోటకా తకహాషి.