: నజియా బయోపిక్ లో నటించాలనుందంటున్న అలియాభట్
బాలీవుడ్ లో కొనసాగుతున్న బయోపిక్ ల హవాపై యువ హీరోయిన్ అలియాభట్ మనసుపారేసుకుంది. తాను కూడా ఓ బయోపిక్ లో నటిస్తానని చెబుతోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ, ప్రఖ్యాత పాక్ గాయని నజియా హసన్ పాత్రలో తనకు నటించాలని ఉందని తెలిపింది. ఆమెలాగే తాను ఓ గాయని కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని వెల్లడించింది. కథానాయికగా కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్లకే ఈ అమ్మడికి ఈ తరహా చిత్రంపై ఆలోచన వెళ్లడం గమనార్హం. అయితే అలియా అభిప్రాయం తెలిసి ఏ దర్శకులైనా ముందుకొస్తారో? లేదో? చూడాలి. ప్రస్తుతం షాహిద్ తో అలియా నటించిన 'షాన్ దార్' ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.