: మంచి పాత్రలు వస్తే తెలుగులో నటించేందుకు సిద్ధం: సినీ నటి నగ్మా
ఇటీవల అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తాను ఎన్నిక కావడంపై సినీ నటి, ఆ పార్టీ నాయకురాలు నగ్మా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ చరిత్ర కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాగా మంచి పాత్రలు వస్తే తెలుగులో నటించేందుకు తాను సిద్ధమని నగ్మా తెలిపారు.