: దుర్గామాత... ప్రపంచానికే తల్లి: ముస్లిం మహిళ


దుర్గామాత ఆలయాన్ని పునర్నిర్మించి, దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ, మత సామరస్యానికి ఆదర్శంగా నిలుస్తోంది ఒక ముస్లిం మహిళ. ఈ అరుదైన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రోజుకూలీ చేసే కార్మికురాలు సుష్రూ బీ(45) గత పదేళ్లుగా తన కుటుంబంతో మంద్ సౌర్ జిల్లాలోని ఇంద్ర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటిపక్కనే ఉన్న ఒక ఆలయంలో దుర్గామాత శీత్లామాతగా కొలువు తీరి ఉంది. అయితే, శిథిలావస్థలో ఉండటంతో దాని పునరుద్ధరణ నిమిత్తం స్థానికుల నుంచి రెండు రూపాయల చొప్పున సేకరించింది. ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిథిగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుష్రూబీ మాట్లాడుతూ, "మతంతో మాకు పట్టింపులేదు. అందుకే ఆలయాన్ని పునరుద్ధరించాం. ప్రపంచానికే తల్లి దుర్గామాత. అందుకే, హిందు, ముస్లింలు కలిసి ఆలయాన్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నాము. ఆలయ కమిటీలో హిందు, ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఆలయంలో రెండు పూటలా జరిగే హారతి కార్యక్రమానికి హిందు, ముస్లింలు విధిగా హాజరవుతారు" అని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News