: పన్ను ఎగవేతదారులను పట్టిస్తే పారితోషికం ఇస్తాం: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ
తెలంగాణలో పన్ను ఎగవేత దారుల ఆట కట్టించేందుకు వాణిజ్య పన్నుల శాఖ కొత్త పద్ధతిని అవలంబించబోతోంది. పన్ను ఎగవేత దారులను పట్టించిన వారికి నజరానా ఇస్తామని ప్రకటించింది. వారి సమాచారం తమకు ఇచ్చిన వారికి పన్నులో పది శాతం వాటా, రూ.50వేల ప్రోత్సాహక నగదు బహుమతి కూడా ఇస్తామని తెలిపింది. ఈ మేరకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది. 1800 4253787 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలపాలని కోరింది.