: భోగాపురంలో భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించబోయే ఎయిర్ పోర్టుకు భూసేకరణపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఇప్పటికే భూ సేకరణకు నోటీస్ ఇచ్చింది. ఈ క్రమంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఉప్పాడ సూర్యానారాయణ, కాకర్లపూడి సత్యనారాయణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల చివరిలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతవరకూ రైతుల పంటలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించింది.