: బాలీవుడ్ నటుడి ఆలస్యం.. ప్రచారసభ వద్ద ఉద్రిక్తత


ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభకు ఆయన ఆలస్యంగా వెళ్లడంతో ప్రజలు ఆందోళనకు దిగారు.. రాళ్లు విసిరారు.. కుర్చీలు ఎత్తివేసి నానా హంగామా సృష్టించారు. ఈ సంఘటన బీహార్ లోని నలంద జిల్లా బిహార్ షరీఫ్ పట్టణంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ అక్కడ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఉదయం పదిన్నరకు రావాల్సిన అజయ్ దేవగణ్ మధ్యాహ్నం ఒంటి గంటకు రావడంతో ప్రజలు మండిపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో జరిగిన కొన్ని ప్రచార సభల్లో కూడా అజయ్ కు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

  • Loading...

More Telugu News