: తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్


తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధానాలు రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని పిటిషన్ లో తెలిపారు. కొన్ని రోజుల కిందట జన చైతన్య సమితి హైకోర్టులో రైతుల ఆత్మహత్యలపై ఓ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన కోదండరాం తాజాగా మళ్లీ పిటిషన్ వేశారు. ఇటీవల ప్రొఫెసర్ గా రిటైర్ అయి జేఏసీ తరపున ప్రజా సమస్యలపై పోరాడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై తొలిసారి తన వ్యతిరేకత తెలిపారు.

  • Loading...

More Telugu News