: పీకల్లోతు కష్టాల్లో రష్యా: బాంబు పేల్చిన అధ్యక్షుడు పుతిన్
రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత అధికంగా ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టిందని ఆయన అన్నారు. "దేశంలో ఆర్థిక కష్టాలు శిఖరాగ్రానికి చేరాయి" అని ఓ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మాస్కోలో సదస్సు ప్రారంభం కాగా, అధ్యక్షుడు పుతిన్ ప్రసంగం సంచలనం కలిగించింది. రక్షణ అవసరాల నిమిత్తం పెడుతున్న పెట్టుబడిని ఎంతగా తగ్గిస్తున్నప్పటికీ, కష్టాలు తీరుతాయన్న నమ్మకం కలగడం లేదని ఆయన అన్నారు. కొంత భారాన్ని ప్రజలపై మోపక తప్పదని వ్యాఖ్యానించిన ఆయన త్వరలోనే వివిధ రకాల పన్నులు పెంచనున్నామన్న సంకేతాలు వెలువరించారు.