: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయిన కేసీఆర్
తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి పలువురు మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు గదుల పడక ఇళ్ల నిర్మాణం, హరితహారం, జలహారం, భూముల వేలం, ప్రాజెక్టులకు భూముల సేకరణ, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నుంచి సలహాలు స్వీకరిస్తున్నారు.