: దొంగ అనుకుని భార్యను కాల్చి చంపేశాడు!


ఎవరో దొంగతనం నిమిత్తం తన ఇంటిలోకి ప్రవేశిస్తున్నారని పొరపడి ఓ వ్యక్తి తన భార్యపైనే కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమయ్యాడు. అమెరికాలోని టెక్సాస్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శాన్ ఆంటోనియో ప్రాంత నివాసి డెబోరా కెల్లీ, నేషనల్ సర్జికల్ హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త లార్స్ ఇజో వ్యాపారి. ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి బయట ఏవో శబ్దాలు వినపడగా, దాన్ని లార్స్ గమనించాడు. దూరం నుంచి చూస్తే, చీకట్లో ఎవరో తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. దొంగలు వచ్చారని భావిస్తూ, తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆపై దగ్గర కెళ్లి చూసి షాక్ తిన్నాడు. తను కాల్పులు జరిపింది భార్యపైనేనని తెలుసుకుని దిగాలు చెందాడు. ఈ ఘటనలో కెల్లీ అక్కడికక్కడే మరణించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News