: జగన్ చేసిన దీక్షకు మద్దతు తెలిపిన దిగ్విజయ్ సింగ్


ప్రత్యేక హోదాపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిరవధిక నిరాహార దీక్షకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. హోదాపై చేసే ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ కలసి వస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైఎస్ జగన్ తో తమకు బేదాభిప్రాయాలున్నప్పటికీ హోదాపై కలిసి పని చేస్తామని వెల్లడించారు. హోదా కోసం ప్రయత్నించాల్సిన చంద్రబాబు పరిస్థితిని తనకు అనుకూలంగా మర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడతామన్నారు. ఖజానాలో డబ్బుల్లేకుండా ప్రధాని ఎలా ప్యాకేజీల ప్రకటిస్తారని డిగ్గీ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తన కుటుంబం కోసమే కసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News