: ఒకే గొడుగు కిందకు ఫోస్టర్స్, బడ్ వైజర్!


బ్రిటన్ కేంద్రంగా బడ్ వైజర్, స్టెల్లా ఆర్టోయిస్ లేజర్స్ బ్రాండ్ల బీర్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న సాబ్ మిల్లర్ సంస్థను, అతిపెద్ద బీర్ తయారీ సంస్థ అన్హెయూజర్-బుస్క్ ఇన్ బెవరేజస్ (ఏబీ ఇన్ బేవ్) విలీనం చేసుకోనుంది. ఈ విషయాన్ని సాబ్ మిల్లర్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు 109 బిలియన్ డాలర్లు (సుమారు 7.08 లక్షల కోట్లు) వెచ్చించేందుకు ఏబీ ఇన్ బేవ్ అంగీకరించిందని, ఇరు కంపెనీల బోర్డు డైరెక్టర్లూ విలీనానికి అంగీకరించారని సాబ్ మిల్లర్ వెల్లడించింది. ఏబీ ఇన్ బేవ్ ప్రస్తుతం ఫోస్టర్స్, గ్రోల్చ్ తదితర బ్రాండ్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ లో భాగంగా ఒక్కో సాబ్ మిల్లర్ వాటాకు 44 పౌండ్లు లభించనున్నాయని సంస్థ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కి వెల్లడించింది. పూర్తి నగదును చెల్లించేందుకు ఏబీ ఇన్ బేవ్ అంగీకరించిందని, సెప్టెంబర్ 14 నాటి ఈక్విటీ విలువతో పోలిస్తే ఈ మొత్తం 50 శాతం అధికమని తెలిపింది. ప్రపంచంలో టాప్-2 బెవరేజ్ తయారీదారులుగా ఉన్న రెండు కంపెనీలూ విలీనం కావడంతో ఈ రంగంలో సమీప భవిష్యత్తులో తిరుగులేని ఆధిపత్యం ఏబీ ఇన్ బేవ్ దేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News